Hardik Pandya: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్
- ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో
- అత్యధికంగా శోధించిన అథ్లెట్ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
- మరో ఆటగాడు శశాంక్ సింగ్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇమాన్ ఖేలిఫ్ నిలిచాడు. హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్ లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంకా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులను కూడా దేథాతి ఈ లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది చాలా విషయాల్లో వార్తల్లో నిలిచాడు. విడాకుల నుంచి టీ-20 వరల్డ్ కప్ గెలవడం వరకు అతడిని గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఫలితంగా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది పాండ్యా వార్తల్లోకి రావడానికి గల ప్రత్యేక కారణాల గురించి చూస్తే..
Also Read: Instagram Reels: ఇన్స్టాగ్రామ్ పిచ్చి.. పిల్లల ముందే భార్య దారుణ హత్య..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
హార్దిక్ పాండ్యా కొన్నాళ్ల పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ అతడిని కెప్టెన్‌గా చేసింది. ఈ జట్టుతో రెండేళ్లు గడిపిన తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. అయితే రోహిత్ శర్మ స్థానంలో అతడిని కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ అభిమానులకు నచ్చలేదు. మొత్తం ఐపీఎల్ 2024 సమయంలో ప్రేక్షకులు హార్దిక్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అలాగే అతనిపై అసభ్య పదజాలం కూడా వాడారు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సమయంలో అభిమానుల నుండి అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు, అతను తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఇబ్బందులతో సతమతమయ్యాడు. భార్యా నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా సంబంధం తెగదెంపులు చేసుకున్నారు. చివరికి వారిద్దరూ జూలై 2024లో తమ విడిపోవడాన్ని అధికారికంగా ధృవీకరించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ విడాకుల ద్వారా విడిపోయారు. భార్య నుండి విడిపోవడంతో పాటు, కొడుకు నుండి విడిపోయిన బాధను కూడా హార్దిక్ భరించవలసి వచ్చింది. హార్దిక్, నటాషా జంట అగస్త్య పాండ్యకు జన్మనిచ్చారు. అయితే, విడాకుల తర్వాత నటాషా అగస్త్యను పెంచుతోంది. విడాకుల తర్వాత నటాషా తన కొడుకుతో కలిసి సెర్బియా వెళ్లి దాదాపు 50 రోజుల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. దీని తర్వాత హార్దిక్ తన కుమారుడిని కలిశాడు. అగస్త్యతో కలిసి దిగిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read: Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?
హార్దిక్ పాండ్యా ఈ సంవత్సరం గూగుల్‌లో వార్తల్లోకి రావడానికి కారణం కూడా అతను టి20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడంలో భారత్‌కు సహాయం చేశాడు. అతను ఈ టోర్నమెంట్లో బంతితో, బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ చివరి ఓవర్లో చిరస్మరణీయమైన బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో మిల్లర్ వికెట్ పడగొట్టాడు. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి రెండో సారి టి20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు, ఐపీఎల్ సమయంలో ఆటగాడు శశాంక్ సింగ్ పేరు బాగా వినపడింది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!