Site icon NTV Telugu

Hardik Pandya: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్‌ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్

Hardik

Hardik

Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్‌ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్‌ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇమాన్ ఖేలిఫ్ నిలిచాడు. హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్ లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంకా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులను కూడా దేథాతి ఈ లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది చాలా విషయాల్లో వార్తల్లో నిలిచాడు. విడాకుల నుంచి టీ-20 వరల్డ్ కప్ గెలవడం వరకు అతడిని గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఫలితంగా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది పాండ్యా వార్తల్లోకి రావడానికి గల ప్రత్యేక కారణాల గురించి చూస్తే..

Also Read: Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి.. పిల్లల ముందే భార్య దారుణ హత్య..

హార్దిక్ పాండ్యా కొన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ అతడిని కెప్టెన్‌గా చేసింది. ఈ జట్టుతో రెండేళ్లు గడిపిన తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. అయితే రోహిత్ శర్మ స్థానంలో అతడిని కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ అభిమానులకు నచ్చలేదు. మొత్తం ఐపీఎల్ 2024 సమయంలో ప్రేక్షకులు హార్దిక్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అలాగే అతనిపై అసభ్య పదజాలం కూడా వాడారు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సమయంలో అభిమానుల నుండి అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు, అతను తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఇబ్బందులతో సతమతమయ్యాడు. భార్యా నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా సంబంధం తెగదెంపులు చేసుకున్నారు. చివరికి వారిద్దరూ జూలై 2024లో తమ విడిపోవడాన్ని అధికారికంగా ధృవీకరించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ విడాకుల ద్వారా విడిపోయారు. భార్య నుండి విడిపోవడంతో పాటు, కొడుకు నుండి విడిపోయిన బాధను కూడా హార్దిక్ భరించవలసి వచ్చింది. హార్దిక్, నటాషా జంట అగస్త్య పాండ్యకు జన్మనిచ్చారు. అయితే, విడాకుల తర్వాత నటాషా అగస్త్యను పెంచుతోంది. విడాకుల తర్వాత నటాషా తన కొడుకుతో కలిసి సెర్బియా వెళ్లి దాదాపు 50 రోజుల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. దీని తర్వాత హార్దిక్ తన కుమారుడిని కలిశాడు. అగస్త్యతో కలిసి దిగిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also Read: Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?

హార్దిక్ పాండ్యా ఈ సంవత్సరం గూగుల్‌లో వార్తల్లోకి రావడానికి కారణం కూడా అతను టి20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడంలో భారత్‌కు సహాయం చేశాడు. అతను ఈ టోర్నమెంట్‌లో బంతితో, బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ చివరి ఓవర్‌లో చిరస్మరణీయమైన బౌలింగ్‌ చేశాడు. చివరి ఓవర్‌లో మిల్లర్‌ వికెట్‌ పడగొట్టాడు. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి రెండో సారి టి20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు, ఐపీఎల్ సమయంలో ఆటగాడు శశాంక్ సింగ్ పేరు బాగా వినపడింది.

Exit mobile version