NTV Telugu Site icon

Teacher Sleeping In School: ఈ టీచరమ్మ రూటే సపరేటు.. నిదురపోతున్న ఆమె పిల్లలతో? (వీడియో)

School Teacher

School Teacher

Teacher Sleeping In School Video is Going Viral: సమాజంలో ఎక్కువగా గౌరవించే వృత్తులలో ఉపాధ్యాయులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే.. కేవలం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల తర్వాతనే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇదివరకు కాలంలో శిష్యులు గురువులను ఎంత గౌరవించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే., ఈ మధ్య కాలంలో గురు శిష్యుల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోయింది. స్టూడెంట్స్ టీచర్లు కలిసి పబ్లిక్ గా డాన్సులు వేస్తున్న వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో కొందరు టీచర్ల చేస్తున్న వ్యవహారిక శైలి వల్ల వారి వృత్తికే తలంపులు తెస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు పట్టపగలే మద్యం సేవించి పాఠశాలలకు వచ్చి పిల్లలని హింసించడం., అలాగే కొందరైతే ఏకంగా పాఠశాలలోనే ఓ మూలన చలిచప్పుడు కాకుండా పడుకోవడం లాంటి సంఘటనలకు సంబంధించిన ఘటనలు కూడా చూసాము. ఇకపోతే., తాజాగా మరో మహిళ టీచర్ సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Olympic Games Paris: పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..రైమ్‌ల‌తో పి.వి.సింధు ఆత్మీయ క‌ల‌యిక‌

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ పట్టణంలో ఓ పాఠశాలలో తరగతి గదిలో నిద్రపోవడమే తప్పుఅనుకుంటే.. ఆమెకు గాలి కోసం పాఠశాల పిల్లలతో విస్సన్న కర్రతో విసిరించుకుంటూ మహిళా టీచర్ తప్పు చేసింది. ఈ వీడియోను ఎవరో తెలియకుండా చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. రాష్ట్రంలోని అలీఘర్ పరిధిలో ఉన్న ధనిపూర్ తాలూకాలో ఉన్న గోకుల్ పూర్ గ్రామంలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఆ మహిళ టీచర్ మధ్యాహ్న సమయంలో తరగతిగదిలో కొద్దిసేపు పడుకుంది. కింద చాప వేసుకుని సేద తీరుతూ పిల్లలతో విసిరించుకుంటూ ప్రశాంతంగా పడుకుంది. ఇలా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆమెకు సేవలు చేస్తూ ఉంటె ఆమె మాత్రం మంచిగా నిద్రపోయింది. ఇక ఆ సమయంలో స్కూల్ కి వెళ్ళిన ఎవరో తెలియని వ్యక్తి పిల్లలు చేస్తున్న పనిని చూసి దాని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్లు పంతులమ్మ పై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో., ఇటువంటి వారి వల్లే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా సన్నగిల్లుతోందంటూ కామెంట్ చేస్తున్నారు.

Vizag Drugs Case: మళ్లీ తెరపైకి వైజాగ్‌.. ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్..

Show comments