NTV Telugu Site icon

Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..

House

House

Teacher Harassment: హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఆశించిన న్యాయం దక్కలేదని భావించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Read Also: IND vs PAK Live Updates: భారత్‌ vs పాకిస్థాన్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Read Also: IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌లో బాబర్‌ అజామ్‌ ఆడుతాడా?