Site icon NTV Telugu

Teacher Fired : అయ్యో ఆ ఒక్క మాటతో టీచర్ ఉద్యోగం పోయింది.. మంచి చెప్పినా తప్పేనా?

Unaccademy

Unaccademy

Teacher Fired For Political Comments : టీచర్ లు మనకు చదువు చెప్పడంతో పాటు మంచి చెడు కూడా చెబుతారు. అయితే ఈ విధంగానే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పిన ఓ టీచర్ ఉద్యోగం పోయింది. అతడిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.

అన్ ఎకాడమీ.. ఆన్ లైన్ లో సివిల్ సర్వీసెస్ తో పాటు రకరకాల గవర్నమెంట్ పోటీ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తూ ఉంటుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే ప్రతి విద్యార్థికి తెలిసిన ప్లాట్ ఫామ్ ఇది.  దీనిలో కరణ్ సంగ్వాన్ టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని అన్నారు. వారు మాత్రమే ప్రస్తుత ఆధునాతన పరిస్థితులను అర్థం చేసుకోగలరని, చదువుకోని వారికి ఏఐ లాంటి వాటి గురించి ఏం అర్థం కాదని అర్థం వచ్చేట్టట్లు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో అన్ ఎకాడమీ కరణ్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ఉపాధ్యాయుడు చెప్పిన దాంట్లో తప్పులేదని అతనికి మద్దతుగా నిలిచారు. చదువుకున్న వారికి ఓటు వేయమని చెప్పడంలో తప్పేముందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగమని నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరని అరవింద్‌ కేజ్రీవాల్ సైతం పేర్కొన్నారు. చాలా మంది ఈ విషయంలో అన్ అకాడమీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక దీనిపై అనాకాడెమీ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ స్పందిస్తూ కరణ్ సంగ్వాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్న విద్యా వేదిక అన్ ఎకాడమీ అని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు నిష్పాక్షికమైన జ్ఞానాన్ని పొందేలా చేయడం కోసం తమ ఉపాధ్యాయులందరికీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన స్థలం కాదన్నారు. అవి విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కరణ్ తన వ్యక్తిగత అభిప్రాయాలను విద్యార్థులతో చెప్పి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని అందుకే ఆయనను తొలగించాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు.

 

Exit mobile version