TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!

Tdp Zp Chairman And Vice Ch

Tdp Zp Chairman And Vice Ch

TDP ZP Chairman and Vice Chairman Candidates List: పదవులకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఎవరికి ఏ జిల్లాలో పదవులు కేటాయించాలనే అంశంపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కూటమి నేతలు తెరదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించి జిల్లాల వారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన చర్చల అనంతరం గురువారం రాత్రి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లలో కూటమి పార్టీలు విజయం సాధించిన చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కూటమికే దక్కనున్నాయి. మొత్తం 27 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒకటి కేటాయించారు. అలాగే వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 స్థానాలు దక్కనున్నాయి.

టీడీపీ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా (22)
22 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. జిల్లాల వారీగా టీడీపీ ఖరారు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
* విజయనగరం – మజ్జి సిరి సహస్ర
* విశాఖపట్నం – గాడు అలివేణి
* పోలవరం – వంతల రాజేశ్వరి
* తూర్పు గోదావరి – కాడ పద్మ
* డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – గొల్లపల్లి అమూల్య
* పశ్చిమ గోదావరి – ఇందుకూరి రామకృష్ణంరాజు
* ఏలూరు – చింతమనేని సాయి నవ్యశ్రీ
* ఎన్టీఆర్ – కోట పుల్లమ్మ
* గుంటూరు – ధార అరుణ
* పల్నాడు – పుచ్చకాయల రమాదేవి
* బాపట్ల – పుషడపు రోహిణి
* ప్రకాశం – కొక్కిలిగడ్డ ప్రభాకరరావు
* మార్కాపురం – కందుల రామిరెడ్డి
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
* కర్నూలు – చూడి ఉలిగయ్య
* నంద్యాల – షేక్ బ్రుహానుద్దీన్
* అనంతపురం – గంజే నాగరాజు
* శ్రీ సత్యసాయి – పరిటాల శ్రీరామ్
* వైఎస్ఆర్ కడప – పుత్తా నరసింహారెడ్డి
* అన్నమయ్య – సుగవాసి ప్రసాద్ బాబు
* తిరుపతి – హేమలత
* చిత్తూరు – మాదలం శైలజ

టీడీపీ జడ్పీ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా
జడ్పీ వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20 స్థానాలు కేటాయించారు.
* శ్రీకాకుళం – గుంటు విజయ్ కుమార్
* విజయనగరం – పసల నీరజ
* పార్వతీపురం మన్యం – వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్
* విశాఖపట్నం – సుకవాసి అజయ్ ఎ.ఎన్.
* అనకాపల్లి – పెంటకోట స్వాతి
* పోలవరం – తీగల ప్రభ
* కాకినాడ – పిల్లి అనంతలక్ష్మి
* పశ్చిమ గోదావరి – సిరగాని నాగేశ్వరరావు
* ఏలూరు – బొర్రా చలమయ్య
* కృష్ణా – దండమూరి పూజిత
* గుంటూరు – తల్లా అశోక్ కుమార్
* పల్నాడు – నల్లపాటి కీర్తన
* మార్కాపురం – జి.వి. శ్రీనివాస వర్మ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – పొట్టెల్ల ప్రసాద్
* కర్నూలు – షేక్ షాదిక
* నంద్యాల – కె. శ్రీకాంత్ రెడ్డి
* అనంతపురం – వెన్నపూస లలిత
* వైఎస్ఆర్ కడప – హబీబున్నీసా చాంద్ బాయి

ఉత్కంఠకు తెర.. అభ్యర్థుల ప్రకటనతో స్పష్టత
జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం ఆశావహులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కుతాయి? ఏ జిల్లాలో ఎవరికి అవకాశం కల్పిస్తారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. చివరకు కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తవడంతో పాటు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. తాజా ప్రకటనతో జిల్లాల వారీగా జడ్పీ పీఠాలను అధిష్ఠించబోయే నేతలపై స్పష్టత వచ్చింది.