NTV Telugu Site icon

High Tension: ఆత్రేయపురంలో టీడీపీ- వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. పోలీసులు అలర్ట్

Athriyapuram

Athriyapuram

TDP-YCP leaders Clash: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది. తన తమ్ముడిపై దాడి చేసిన వారు ఈరోజు ఉదయం9 గంటలకు రావిచెట్టు సెంటర్ కు దగ్గరకు రావాలంటూ టీడీపీ నేతలకు వైసీపీ నేత వేగేసిన రాజు మిల్లు గోపి సవాల్ విసిరారు. కాగా, వైసీపీ నేత సవాల్ ను స్వీకరించి రావి చెట్టు దగ్గరకు తెలుగుదేశం నేతలు బయలుదేరారు. అదే, సమయంలో అటుగా వచ్చిన వేగేశిన రాజుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడి సమయంలో అడ్డుకొనేందుకు వెళ్ళిన ఎస్ఐకి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అత్రేయపురం గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: PM Modi: దశ్వమేధ ఘాట్‌లో గంగామాతకు ప్రధాని పూజలు.. బీహార్ సీఎం గైర్హాజరు

ఈ ఘటనతో ఆత్రేయపురం గ్రామంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ- టీడీపీ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆత్రేయపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. టీడీపీ- వైసీపీ నేతల దాడితో గ్రామంలో పోలీసులు పీకేటింగ్ నిర్వహించారు. ఎవరైన దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గాయపడిన ఎస్ఐను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.