ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ పార్టీ అభ్యర్థ జాబితా ప్రకటించడంతో పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతుంది. టికెట్ విషయంలో గెలుపు గుర్రాలకే జగన్ అవకాశం ఇస్తున్నాడు. ఇక, మరో వైపు టీడీపీ- జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైన జగన్ సర్కార్ ను గద్దె దించాలని చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుని మరి తిరుగుతున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా మెల్లిగా ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకని పొలిటికల్ హీట్ పెంచేసింది.
Read Also: Komaram Bheem: పులి దాడిలో పశువులు చనిపోతే రూ.5 వేలు.. అటవీశాఖ అధికారులు ప్రకటన
అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపలో టికెట్ దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో పక్క పార్టీల్లో నుంచి అధికార వైసీపీలోకి కూడా వస్తున్నారు. అయితే, తాజాగా విజయవాడలో సంక్రాంతి పండగ రోజు ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా ఫ్లెక్సీల వార్ సాగుతుంది. అయితే, పెనమలూరుకు జోగి రమేష్ సరికాదని పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ హోర్డింగులు వెలిశాయి. లోకల్ వ్యక్తిగా ఉన్న పడమటి సురేష్ కు సీటు ఇవ్వాలని నియోజక వర్గమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెనమలూరులో ఎమ్మెల్యే పార్థసారథి ఫ్లెక్సీలు అన్నీ మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుంది. ఇక, తిరువూరులో టీడీపీ పార్టీని వీడిన ఎంపీ కేశినేని నానీ, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫోటోలను ఫ్లెక్సీల నుంచి టీడీపీ శ్రేణులు కట్ చేస్తున్నారు.