NTV Telugu Site icon

Atchannaidu: నేడు ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ బృందం

Tdp

Tdp

నేడు ఎన్నికల సంఘాన్ని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ బృందం కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారు అనే అంశంపై డేటాను ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు ఇవ్వనున్నారు. ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ టీమ్ ఎన్నికల అధికారికి క్లారిటీగా వివరించనున్నారు.

Read Also: Ponguleti: ఎగిరిపోయిన పక్షులన్నీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతున్నాయి.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏపీలో ఓట్ల తొలగింపులో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నకిలీ ఓట్ల రచ్చ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నకిలీ ఓట్లు చేర్పించి ఉన్న ఓట్లు తొలగించారని అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పలు మార్లు సమీక్షలు నిర్వహించి వీటిపై కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయినా నకిలీ ఓట్ల దందా ఆగడం లేదు.. దీంతో టీడీపీ ఇవాళ మరోసారి సీఈవోకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది.