TDP: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ పూర్తి కానుంది.. దీంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఈ రోజు.. వర్చువల్‌గా విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాలపై టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది.. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
Read Also: KTR Tweet: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు.. కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది తెలుగుదేశం పార్టీ.. మరోవైపు.. చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా నిర్ణయానికి వచ్చారు.. భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి నారా లోకేష్ వెళ్లబోతున్నారు.. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మొత్తంగా వరుస కార్యక్రమాలతో హోరెత్తించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు.. ఇవాళ చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.