Site icon NTV Telugu

పట్టాభి తిట్టింది జగన్‌ను కాదు.. సజ్జలను: అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. సానుభూతి వస్తుందనుకుంటే జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని ఆయన ఆరోపించారు. పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జలను అని.. సానుభూతి కోసం జగన్ తననే అన్నారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఓట్లు, సీట్లు వస్తాయని గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కూడా పట్టాభి తిట్టిన బోసిడీకే అన్న పదాన్ని జగన్ తనకు అన్వయించుకుంటున్నారని మండిపడ్డారు.

Read Also: బాబుకి వల్లభనేని వంశీ దిమ్మతిరిగే కౌంటర్

అసలు బోసిడీకే అన్న పదం పెద్ద తిట్టే కాదన్నారు. తెలంగాణ పదకోశంలో బోసిడీకే అంటే ‘పాడైపోయిన’ అని అర్థం ఉందన్నారు. బోసిడీకే అనే పదానికి పెడర్థాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డుకు జగన్ బయటకు తీశాడని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తల్లిపై జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే తల్లిని తిట్టిన వారికి మంత్రి పదవి ఇవ్వడని.. తల్లిని, చెల్లిని తెలంగాణ రోడ్లపై అనాథగా వదిలేయడని వ్యాఖ్యానించారు.

Exit mobile version