Site icon NTV Telugu

Chalo Assembly: ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్

Tdp1

Tdp1

ఏపీ అసెంబ్లీ (Ap assembly) వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. తెలుగురైతు విభాగం ఆధ్వర్యంలో నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఛలో అసెంబ్లీకి మద్దతుదా టీడీఎల్పీ చేపట్టాలనుకున్న నిరసన ర్యాలీ పై పోలీసుల ఆంక్షలు విధించారు. ఎడ్లబళ్లతో ర్యాలీకి సిద్దమైంది టీడీఎల్పీ.ఎడ్ల బళ్లను అక్కడినించి ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు. ఎడ్ల బళ్ల చోదకుల్ని బెదిరించి ఎడ్లను, ఎడ్ల బళ్లను పోలీస్ స్టేషన్ కి తరలించారు.

తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషనుకు తెలుగుదేశం ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బళ్లు తరలించారు. పోలీస్ స్టేషనులో ఎడ్ల బళ్లు పెట్టి టైర్లలో గాలి తీసిన పోలీసులు.. ఎడ్లను పోలీస్ స్టేషన్ నుంచి దూరంగా తోలేశారు పోలీసులు. ఎడ్లను తోలుకుంటూ దాదాపు కిలోమీటర్ దూరం వెంబడించారు పోలీసులు. దీంతో అసెంబ్లీ వద్ద టెన్షన్ నెలకొంది. పోలీసు స్టేషనులో ఉంచిన బళ్లను బయటకు తెచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యేలే కాడి తగిలించుకుని నిరసన (Protest) తెలిపారు. ఎడ్ల బళ్లపై పోలీసు ప్రతాపం ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Adilabad NIA Raids: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో NIA సోదాల కలకలం

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి. 3 ఏళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గం. పశువుల పట్ల కూడా ప్రభుత్వానికి కనికరం లేదని, రైతు సమస్యల పట్ల నిరసనను కూడా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు.

Read Also: Adilabad NIA Raids: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో NIA సోదాల కలకలం

Exit mobile version