NTV Telugu Site icon

TDP-Janasena Meeting: ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ

Tdp Janasena

Tdp Janasena

రేపు విజయవాడలో టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందు ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ- పీఏసీ భేటీలో చర్చించనున్నారు. ఇక, రేపటి జేఏసీ సమావేశానికి టీడీపీ- పీఏసీ అజెండా ఖరారు చేయనున్నారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరుపై చర్చ జరుగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై ప్రధానంగా టీడీపీ-పీఏసీలో చర్చించనున్నారు.

Read Also: Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్

ఇక, విజ‌య‌వాడ‌లోని జరిగే ఈ మీటింగ్ కి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజరవుతారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి రావడం లేదు. ఈ భేటీలో కీల‌క అంశాల‌పై ప్రధానంగా చ‌ర్చ జరిగే అవకాశం ఉంది. గ‌త భేటీలో మేనిఫెస్టోపై ప‌వ‌న్-లోకేష్ మధ్య చర్చ జరిగింది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చర్చించినట్లు తెలుస్తుంది.

Read Also: Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

అయితే, రేపు జ‌రిగే ఈ స‌మావేశంలో మేనిఫెస్టోకు టీడీపీ-జనసేన తుదిరూపు తీసుకు వచ్చే అవకావం ఉంది. ఇప్పటికే సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు రెడీ చేయగా.. మరోవైపు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రతిపదించింది. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ క్లారిటికీ రానున్నట్లు సమాచారం. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక రేపు జ‌రిగే మీటింగ్ లో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా టీడీపీ-జనసేన పార్టీలు ఓ కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు టాక్ వినిపిస్తుంది.