NTV Telugu Site icon

B.Ramagopal Reddy: ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు?

Bhumireddy Ramgopal Reddy

Bhumireddy Ramgopal Reddy

ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు జగన్..? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. మార్చి నెల ముగుస్తున్నా ఒంటి పూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఇదెక్కడి రాజ్యాంగం..? ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే ఇది సాధ్యమవుతోంది. ఎండలు మండిపోతుంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో అర్ధం కావడం లేదు.

ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయి? అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా?పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా?పట్టుమని పదిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమంటే అన్ని రోజులు మా వల్ల కాదని వైసీపీ నేతలు కళ్లు తేలేస్తారు.చిన్నపిల్లలు మాత్రం మండే ఎండల్లో రోజంతా స్కూళ్లలో ఉండాలా? అని భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు.

Read Also: Minister Ktr: ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది

ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి పక్కన పెట్టాలి.ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులు పెట్టడం లేదు.పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యా మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలిన చర్య.విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read Also: Icon Star: తొలి చిత్రంతోనే భళిరా అనిపించిన బన్నీ!