NTV Telugu Site icon

Panchumarthi Anuradha: జగన్ రెడ్డి.. స్కిల్‌ని స్కాం అన్నావు.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి ప్రధాని పేరు, ఫొటో పెట్టావు..!

Panchumarthi Anuradha

Panchumarthi Anuradha

Panchumarthi Anuradha: జగన్ రెడ్డి.. స్కిల్‌ని స్కాం అన్నావు.. మరి ఈ రోజు ఏయూలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. ఎందుకు అని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.. రాష్ట్రం మొత్తం మీద 42 సెంటర్లు లేవన్నావు. ఆ సెంటర్లకు ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. పరికరాలు ఇవ్వలేదన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు. మనీ లాండరింగ్ జరిగిందన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. ఒప్పందాల జీవోలకు పొంతన లేదన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. బోగస్ ఇన్వాయిస్ లు పెట్టి నిధులు దోచేశారన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు… దీంతో.. సీఎం వైఎస్‌ జగన్‌ మతలబు ప్రజలకు తెలిసిపోయిందని విమర్శించారు.

Read Also: Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఫైనల్స్‌కు చేరిన హాకీ జట్టు

అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైఎస్‌ జగన్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు అని దుయ్యబట్టారు అనురాధ.. చంద్రబాబు నిజాయితీపరులుగా వస్తున్నారని తెలుసుకుని ఈ హడావుడి చేస్తున్నావు అని మండిపడ్డారు. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని వారికి మంత్రి పదవి ఇచ్చారంటూ సెటైర్లు వేసిన ఆమె.. కాపులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడిన వారికి మంత్రి పదవి కట్టబెట్టారు.. పూజారులను కొడితే తప్పేంటన్న వారికి మంత్రి పదవి ఇస్తారు.. ఇవేనా? వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గొప్పతనాలు అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.