NTV Telugu Site icon

MLC Anuradha: రోజా నీ స్థాయి ఏంటి.. నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి..?

Anuradha

Anuradha

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ,ఈడీ ఎంక్వైరి త్వరగా చేయాలనే కోరే దమ్ముందా నీకు.. సీఎం జగన్ కు ఉందా అంటూ ఎమ్మెల్సీ అనురధా అడిగారు.

Read Also: HanuMan : ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…

ఉదయం ఎక్స్ సైజులు మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం, రాత్రి పూట పార్టీలు తప్ప ఎమ్మెల్యే, మంత్రిగా ఏం చేశావ్ నగరికి కానీ, రాష్ట్రానికి నీవు చేసింది ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 16 కార్లు, నాలుగు పెట్రోలు బంకులు, ఎస్సీ,ఎస్టీ ఎసైండ్ భూములు లాక్కున్నావ్ అని ఆమె ఆరోపించారు. రోజా, రోజా అన్నదమ్ములు అనుకోండాల్లా నగరిని దోచేశారు.. నువ్వు సంపాదించిన వందల కోట్లాది ఆస్తుల మీదా సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ముందా అంటూ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. మేం అధికారంలోకి వచ్చాక.. ప్రజలకు తగిన న్యాయం చేస్తామని ఆమె పేర్కొన్నారు.