NTV Telugu Site icon

AP Assembly: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

Ap Assembly

Ap Assembly

AP Assembly : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హీట్‌ పెంచాయి.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. చర్చకు పట్టుబట్టడం, స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టడం.. ప్రతిగా వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం దగ్గరకు దూసుకురావడం.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో స్పీకర్‌ సభను వాయిదా వేయడం జరిగిపోయాయి.. అయితే, వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళన దిగారు.. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టకుండా మార్షల్స్ ఏర్పాటు చేయగా.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లటానికి మార్షల్స్ ను నెట్టే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు.. ఇక, సభలో గందరగోళ పరిస్థిలు ఏర్పడడంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

అనగాని ప్రసాద్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. మరోవైపు.. సభలో మీసాలు మెలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను హెచ్చరించారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మొదటి తప్పు గా పరిగణిస్తున్నాం.. పునరావృతం చేయవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

AP Assembly : These MLAs are Suspended From Entire Session | Ntv