NTV Telugu Site icon

MLA Velagapudi vs MP MVV: ఎంపీ ఎంవీవీకి టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్‌ ఛాలెంజ్..! రెడీయా..?

Velagapudi

Velagapudi

MLA Velagapudi vs MP MVV: విశాఖపట్నంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం, మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్‌ చేసి.. టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. ఇక, వాటికి ధీటుగా కౌంటర్‌ ఎటాక్‌ దిగుతున్నారు ఎంపీ ఎంవీవీ.. తాజాగా, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బహిరంగ సవాల్‌ విసిరారు.. దమ్ముంటే రంగా కేసు రీ ఓపెన్ చెయించి.. నేను హత్య చేసినట్లు నిరూపించగలవా..? అని నిలదీశారు. కోర్టు కొట్టేసిన కేసులో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ భూ భక్షకుడు.. ఓ దిక్కు మాలిన బిల్డర్‌ అంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: Ooru Peru Bhairavakona Collections: దుమ్ము దులిపేసిన ‘ఊరు పేరు భైరవకోన ‘ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

వైసీపీలో ఎమ్మెల్సీ వంశీకృష్ణని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీ పార్టీ నుండి ఆయన బయటికి వచ్చేశాడని వ్యాఖ్యానించారు వెలగపూడి.. ఎంపీ ఎంవీవీ వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తి.. ఆ విషయం వైసీపీ ముఖ్య నేతే చెప్పారన్నారు. లిక్కర్ వ్యాపారంలో నా మీద ఒక్క కేసు కూడా లేదు.. భూ కబ్జాలు చేసినట్టు నీ మీద బోలెడన్ని కేసులున్నాయి.. నీ కుంభకోణాలు చెప్పాలంటే రెండు రోజులు సరిపోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా నాలుగున్నర సంవత్సరాల నుండి ఎప్పుడైనా.. ఎక్కడైనా నువ్వు వైజాగ్ లో కనిపించావా..? అని నిలదీశారు. నేను నీ వెంట్రుక పీకలేనన్నావు, ప్రజలే నిన్ను వచ్చే ఎన్నికల్లో సముద్రంలో పడేస్తారు అంటూ.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు.