Site icon NTV Telugu

MLA Nimmala Ramanaidu Arrest: వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఆందోళన.. పాలకొల్లులో టెన్షన్‌ టెన్షన్‌

Tdp

Tdp

MLA Nimmala Ramanaidu Arrest: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోటీ పోటీ ఆందోళనలతో కాకరేపాయి.. వైసీపీ, టీడీపీ ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్ల విషయంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పాలకొల్లులో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీలకు అనుమతి ఇవ్వకుండా ఎమ్మెల్యే రామానాయుడును, వైసీపీ ఇంఛార్జ్‌ గుడాల గోపి లను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇంటి నుండి పోలీసుల కన్నుగప్పి.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు.. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకొడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కళ్ళు కప్పి ఎమ్మెల్యే గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇంటి వద్ద నుండి భారీ జన సందోహం జాతీయ జెండాలతో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎమ్మెల్యే రామానాయుడు ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read Also: Balka Suman: చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారు.. బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version