NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీలో ఉంటా.. ఎలాంటి అనుమానం లేదు..!

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్‌ నుంచి తాను పోటీలో ఉంటానని అన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు తెలిపారు. రాజమండ్రి రూరల్‌ టికెట్‌ మరొకరికి ఇస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి వర్తలను నమ్మి.. భావోద్వేగాలకు గురికావొద్దని అన్నారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం.. తాను కచ్చితంగా పోటీ చేస్తానంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై త్వరలోనే చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారన్నారు.

అయితే, టీడీపీ-జనసేన మధ్య పొత్తులోగా భాగంగా.. రాజమండ్రి రూరల్‌ టికెట్‌ జనసేన నేత కందుల దుర్గేష్‌కి ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ టికెట్‌ ఆశించిన టీడీపీ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవిష్యత్‌ ఏంటని..? కూడా చర్చ జరిగింది. ఈ సమయంలో.. తానే పోటీలో ఉన్నట్టు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ చేయడం.. రాజమండ్రి రాజకీయ చర్చకు దారితీసింది. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులు పర్యటనలో భాగంగా రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలకు సంబంధించిన 60 మంది జనసేన పార్టీ ముఖ్య నేతలు, టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావాహులతో సమావేశం అయ్యారు. జనసేన పార్టీ తనకు బలమున్న తూర్పుగోదావరి జిల్లా పై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలు గాను ఆరు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తుంది. దీనిలో భాగంగా గత నెల 26వ తేదీన రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఇక,ఇవాళ జరిగిన సమావేశంలో రాజమండ్రి రూరల్ టికెట్టు కూడా జనసేన పార్టీ దేనిని పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.‌ ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ టిక్కెట్ ఆశిస్తున్న కందుల దుర్గేష్ మీడియా ముందు ప్రకటించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో జనసేన పార్టీదేనని. ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు మండపేట, రాజానగరం, రాజమండ్రి రూరల్ స్థానాలను టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు రాజమండ్రి రూరల్, రాజానగరం టికెట్లను కోల్పోవడం ఆ సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదని అంటున్నారు.