NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: ఏఏజీ పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ కేసుకు టీడీపీ డిమాండ్‌..

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిని ఆయన ఇచ్చిన జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. ముందు కేసులు పెట్టి తరువాత విచారణ చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.

Read Also: Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కొత్త కార్యక్రమం.. ‘ఒక్కడే.. ఒంటరిగా..’

ఇక, పదేళ్లుగా వైఎస్‌ జగన్ అక్రమ ఆస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ వాయిదాలు తీసుకుంటూ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్యే గోరంట్ల.. సీఐడీని దుర్వినియోగం చేస్తున్న మీకు ఎన్ని నోటీసులు ఇవ్వాలలని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ కాపాడుతుందు.. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడాన్ని ఆక్షేపించారు. మరోవైపు.. ఈ నెల 24వ తేదీ నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల విధుల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలిపారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.