Site icon NTV Telugu

Chintamaneni Prabhakar: పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా.. నాలుక కోస్తా.. తొక్కిపెట్టి నార తీస్తా..!

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. కూటమి ప్రభుత్వం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. అంతే కాదు, ధాన్యం బకాయిలు, తల్లికి వందనం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు.. వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడితే మాట్లాడండి తప్పులేదు.. కానీ, లండన్ లో తొంగునే నీకు దెందులూరు నియోజకవర్గం గురించి ఎందుకు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీ సొంత ఊరు వస్తా.. ప్రభుత్వంపై మీరు చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని అని సవాల్‌ విసిరారు చింతమనేని.. పథకాల అమలు విషయంలో ఎవరిని మోసం చేశామో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.. అసత్య ప్రచారాలు చేస్తే తొక్కిపెట్టినార తీస్తాను అంటూ సీరియస్‌ కామెంట్లు చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌..

Read Also: SakshiMalik : బాబోయ్ బికినీలో సాక్షి మాలిక్ ఏంటి ఇంత హాట్ గా ఉంది

కాగా, దెందులూరు నియోజకవర్గంలో కేసులు, కొట్లాటలతో వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ మధ్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచితనం చేతకానితనం కాదని, కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందన్నారు. రానున్న రోజుల్లో అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తా అని హెచ్చరించారు. దెందులూరులో అబ్బయ్య చౌదరిని తప్పిస్తే రాజకీయం తాము చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారని, అలాంటివి ఏమీ కుదరవన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి తాను బాకీ లేను అని అబ్బయ్య చౌదరి చెప్పుకొచ్చారు. కొండలరావుపాలెంలో జరిగిన “చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ” కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పథకాలపై ఫైర్ అయ్యారు అబ్బయ్యచౌదరి..

Exit mobile version