Site icon NTV Telugu

AP Speaker: స్పీకర్‌గా ఆ సీనియర్‌ ఎమ్మెల్యే పేరు ఖరారు.. జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవి..!

Ayyanna Patrudu

Ayyanna Patrudu

AP Speaker: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. ఇప్పటికే సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకారం.. మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నికపై కసరత్తు చేస్తోంది అధికార పక్షం.. ఏపీ స్పీకర్‌ పేరు ఎంపిక దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ని ఎంపిక చేసినట్టు సమాచారం.. ఇక, డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది.. డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు..

Read Also: Rain Alert: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

అయితే, ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా బీసీ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం.. టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్‌ రేసులో అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించినా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌… గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్నపాత్రుడు వైపే మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. అయితే, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version