Yarlagadda Venkat Rao: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా యాదవ సామాజిక వర్గ నేత, దివంగత టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. యాదవుల సంక్షేమాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వ్యవసాయం, పశు పోషణ, పాల ఉత్పత్తి తదితర రంగాల్లో యాదవ సోదరులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లభించే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసమే టీడీపీ ఆవిర్భవించిందని గుర్తు చేసిన ఆయన.. రాజకీయం, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు కోసం యాదవ సామాజిక వర్గం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
Read Also: Pemmasani Chandrashekar: టీడీపీకి కంచు కవచంలా నిలబడతాం..
గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సూపర్ సిక్స్ పేరుతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. పతనమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలన్నా సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు సీఎం అవ్వాలన్నారు. ప్రజలందరూ తనకు మద్ధతు పలికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చుల బోసుబాబు, సర్నాల బాలాజీ, చిమట రవివర్మ, అమృతపల్లి సూర్యనారాయణ, కొలుసు రాంబాబు, మజ్జిగ నాగరాజు, మందపాటి రాంబాబు, దండిబోయిన రాంపండు, నెర్సు గోపాలకృష్ణ, నెర్సు రామ్మోహన్, చిన్నుబోయిన వెంకటేశ్వరరావు, మాగంటి రంగారావు, శివాజీ, రొంటె శ్రీమన్నారాయణ, జొన్నలగడ్డ శ్రీను, జొన్నలగడ్డ సుధాకర్, ఉల్లాస శివ, నెర్సు శ్రీకాంత్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న యార్లగడ్డ
గన్నవరం మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని హనుమాన్ నగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, టీడీపీ మండల అధ్యక్షులు దయాల రాజేశ్వర్, బాపులపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీను, ముల్పూరి సాయి కల్యాణి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వడ్డే శివ నాగేశ్వరరావు, పుట్టా సురేష్, మొవ్వ వేణుగోపాల్, జనసేన బాపులపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్, పొదిలి దుర్గారావు, బండ్రెడ్డి రవి, చిమట రవివర్మ, మద్దాల జయరాణి, శివలీల, శిరీష, ప్రసన్న, ముస్లిం పెద్దలు అమీర్ హుస్సేన్, అహ్మద్ రఫీ, అబ్దుల్ అజీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.