Site icon NTV Telugu

Ayyanna Patrudu: ఉండవల్లి మేధావి కాదు.. ఊసరవెల్లి అనే పరిస్థితికి వచ్చింది

Ayyanna

Ayyanna

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సీబీఐ అధికారులకి ఇవ్వాలని అడగడం ఏంటి అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఈ కేసులో ఒక్క ఆధారం అయినా ఉందా అని అడిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించారు దీనికి ఉండవల్లి అరుణ్ కుమార్ వత్తాసా పలికాడు అంటూ మాజీ మంత్రి మండి పడ్డారు. చంద్రబాబు నాయుడి పాలనలో బ్రాందీ సీసాలు చూపించి ఇప్పుడు జగన్ పాలనలో ఎందుకు కళ్లు మూసుకున్నావని అయ్యన్న ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో తిరుపతి కొండపైన ఎన్నో అక్రమాలు జరిగుతున్నాయి.. అయినా ఉండవల్లి ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.

Read Also: Brave Constable : రైల్వే ట్రాక్ పై భార్యపై బ్లేడుతో దాడిచేసిన భర్త.. కాపాడిన కానిస్టేబుల్

తిరుపతి వెంకన్న దేవుడికి అన్యాయం జరిగినా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అడిగారు. పక్కనే గోదావరిలో ఇసుక మాయం అయిపోతున్నా.. ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అందులో వాటా ఉందా అని అయ్యన్న మండిపడ్డారు. రామోజీ రావుపై ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయకపోయినా సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారు.. అయినా ఉండవల్లి ఎందుకు మాట్లాడడం లేదు.. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్‌లో ఉండవల్లి పని చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..

ఉండవల్లి ఇంకా ఎన్నాళ్లు బతుకుతావు? బతికినన్ని రోజులు మంచి పనులు చేయాలి అంటూ చింత కాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఉండవల్లి మేధావి కాదు మేతావి.. ఉండవల్లి అనే మేధావి ని ఊసరవెల్లి అనే పరిస్థితికి వచ్చింది.. ఈ కేసులో ఏమి ఉందని సీబీఐ విచారణ వేయమంటున్నాడు.. జగన్ పరిపాలన గురించి ఎందుకు మాట్లాడ లేకపోతున్నావు.. ఉన్నతమైన కులంలో పుట్టి
టీటీడీలో జరుగుతున్న అక్రమాలు గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అని ఉండవల్లి అరుణ్ కుమార్ పై అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Exit mobile version