Site icon NTV Telugu

Nara Lokesh: పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు!

Mahanadu 2025 Nara Lokesh

Mahanadu 2025 Nara Lokesh

తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పు రావాలని, మహానాడు వేదికగా మరో 40 సంవత్సరాలు పార్టీ నడపడానికి కావలసిన అంశాలపై చర్చించాలన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అంటూ మంత్రి లోకేశ్‌ చెప్పారు. కడప గడ్డపై జరుగుతున్న టీడీపీ మహానాడులో మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారు.

‘తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ. పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగుజాతి ఆత్మగౌరవం, అన్నదాతకు అండ టీడీపీ. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తబలం చాలా గట్టిది. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం. 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు. సొంత తల్లి చెల్లిని మెడపెట్టి గెంటేశారు. అర్థమైందా రాజా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్తకాదు.. అధికారం కొత్తకాదు’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నా అని మంత్రి తెలిపారు.

Also Read: CM Chandrababu: నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం.. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు!

మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపాదించిన ఆరు శాసనాలు ఇవే:
# తెలుగుజాతి విశ్వఖ్యాతి
# యువగళం
# స్త్రీశక్తి
# పేదల సేవల్లో సోషల్‌ రీఇంజినీరింగ్‌
# అన్నదాతకు అండగా
# కార్యకర్తలే అధినేత

Exit mobile version