Varla Ramaiah: భూ దందాపై పూర్తిస్థాయి విచారణకు ఆదేవించాలని ఏపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారం అడ్డు పెట్టుకుని పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది. ఈ కుట్రలో సీఎస్ కీలక పాత్రధారి అని విమర్శించారు.. ఇక, దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూములను సీఎస్, ఆయన కుమారుడు, ఆయన బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపించారని.. ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా మూర్తియాదవ్ ను బెదిరిస్తారా? అంటూ మండిపడ్డారు. పెద్ద సారు అల్లుడే మాఫియా అంతా తిప్పుతున్నారని వార్తలు వస్తుంటే ఎందుకు స్పందించరు? దానికి ఎందుకు సమాధానం చెప్పడంలేదు? అని నిలదీశారు.
Read Also: INDIA Bloc: ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
కడప వ్యక్తి గుప్పెట్లో ఆరు ఎకరాలున్నాయట.. ఈ కడప వ్యక్తి ఎవరో సీఎస్ కు తెలుసా..? అని ప్రశ్నించారు వర్ల రామయ్య.. సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ ప్రాణానికి ముప్పు ఉందన్న ఆయన.. ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు.. ? విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లకు ఇతను ఎలా తెలుసు? తెలిస్తే ఎలా తెలుసో సీఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల భూములను అప్పనంగా అతి తక్కువ ధరకే ఎలా కొట్టేశారు..? అక్రమంగా పేదలను భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు..? అధికారులపై ఆరోపణలు వస్తే పాలన యంత్రాంగం, ఏసీబీ ఊరుకుంటుందా? వెంటనే ఎంక్వైరీ వేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోమని చెబుతారు. ఇప్పుడు వేళ్లన్నీ సీఎస్ వైపు చూపిస్తున్నాయన్నారు.. వెంటనే గవర్నర్ సీఎస్ పై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.. సీఎస్ పదవి నుంచి జవహర్ రెడ్డిని పక్కన పెట్టి విచారణకు ఆదేశించాలి. భూ దందాపై ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలి. ఏసీబీలో నిజాయతీ కలిగిన అధికారికి ఆ కేసును అప్పగించాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ అధికారంలో ఉంటే ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని సీఎస్ ను పదవి నుండి తొలగించాలి. బీ పట్టాలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూముల దగ్గరకు సీఎస్ వెళ్లి చూసి వస్తారు. తరువాత త్రిలోక్ ముఠా గద్దలాగా అక్కడ వాలి పేదలను భ్రమ పెట్టి భూములను కొట్టేస్తున్నారు.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కోరాల్సిన అధికారి ఇలా చేయం కరెక్టేనా? త్రిలోక్ ముఠా కంచే వేయడానికి వెళితే రైతులు తిరగబడ్డారు. ఈ భూ దందాపై గవర్నర్ పూర్తి విచారణకు ఆదేశించాలని కోరారు టీడీపీ నేత వర్ల రామయ్య.