NTV Telugu Site icon

Pattabhi Bail Petition:టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై వాదనలు

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్, కష్టడీ పిటిషన్ల పై వాదనలు జరిగాయి. పీటీ వారెంట్ పై రేపు పట్టాభిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామన్న స్పెషల్ కోర్టు జడ్జి. పిటి వారెంట్ పై ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన పట్టాభి. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఎల్లుండి ఆదేశాలు ఇవ్వనున్నారు స్పెషల్ కోర్టు జడ్జి.

Read Also:Revanth Reddy : నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది

సీఐ ని కులం పేరుతో తిట్టారని పట్టాభిపై ఆరోపణలు ఉన్నాయి. పట్టాభి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐ కనకారావు తరఫు న్యాయవాది వాదించారు. పోలీసు అధికారికే రక్షణ లేనపుడు సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని సీఐ కనకారావు తరఫు న్యాయవాది కోర్టుకి వివరించారు. పట్టాభికి నేర చరిత్ర ఉందని, బాధితులకు ఇబ్బందులు కలుగుతాయని వాదనలు వినిపించారు న్యాయవాది.మరోవైపు పట్టాభిని తోట్లవల్లూరు పోలీసు స్టేషను లో కొట్టారని వాదనలు వినిపించారు పట్టాభి తరఫు న్యాయవాది.

Read Also: February Temperature: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఎండలు అధికం..