Site icon NTV Telugu

Mannam Venkataramana: TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత

Mannem Venkata Ramana

Mannem Venkata Ramana

టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా… గుండెపోటుకు గురయ్యారు మన్నెం వెంకటరమణ. దీంతో వెంటనే మన్నెం వెంకట రమణాను ఏథెన్స్ ఎయిర్ పోర్టు లోని ఆస్పత్రికి తరలించారు.

 PM Modi: నేడు సూరత్‌లో ప్రధాని మోడీ పర్యటన.. 700 మెగావాట్ల అణు ప్లాంట్లు జాతికి అంకితం

అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమం కావడంతో మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా వెంకటరమణ 2009 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలలో… ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలో ఉన్న పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాలలో… కీలక పాత్ర పోషించారు. ఇది ఇలా ఉండగా మన్నెం వెంకటరమణ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ సంతాపం తెలిపింది.

FDI in Space : అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన కేంద్రప్రభుత్వం

Exit mobile version