Site icon NTV Telugu

Kolikapudi Srinivasa Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు..

Kolika Pudi

Kolika Pudi

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19, 20 వార్డులలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక, చంద్రబాబు నాయుడు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ మీ అందరూ టీడీపీకి ఓటు వేయాలని కొలికపూడి కోరారు. అయితే, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈరోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: CM Revanth Reddy: తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్‌ రెడ్డి ట్విట్‌ వైరల్‌

కాగా, తిరువూరు పట్టణంలో మంచినీరు తీవ్రమైన సమస్యగా ఉందనే విషయం అందిరికీ తెలుసు అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. రేపు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ పాతిపదికన కనీస సౌకర్యాలను ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు నాయుడికి చెప్పి ఇళ్లు లేని వారికి టిడ్కో ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలందరికీ నేను మాటిస్తున్నా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను అని కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు.. అధికారంలోకి వచ్చిన రెండో నెల నుంచే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Read Also: Posani Krishna Murali: జగన్‌ను చంపేందుకు కుట్ర..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా..

ఇక, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడతారన్న నమ్మకం ప్రజలలో స్పష్టంగా కనబడుతోంది అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఎలా ఉంటుందో తిరువూరులో కూడా 20 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగబడపోతుంది.. దాని కోసం తిరువూరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.. మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.

Exit mobile version