NTV Telugu Site icon

TDP-JanaSena-BJP Alliance: నేడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి సభకు భూమిపూజ..

Tdp Janasena Bjp

Tdp Janasena Bjp

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని తమ పార్టీల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, ఇవాళ (బుధవారం) ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు అంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also: SSMB29: జక్కన్న సినిమాలో డ్యుయల్ రోల్‍లో మహేష్ బాబు?

ఇక, ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసింది. ఈ మేరకు 17న చిలకలూరిపేటలో తలపెట్టిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. సభ ద్వారా ఒకే వేదికపైకి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు. దీంతో మూడు పార్టీలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.