గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ- జనసేన సోషల్ మీడియా వేధింపులే కారణమని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. వేధింపులకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి రాజకీయంగా ఏమీ మాట్లాడకపోయినా ఎందుకు వేధింపులకు గురి చేశారు.. జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పడమే తప్పా అని ఆమె ప్రశ్నించారు. గీతాంజలి పిల్లలకు దిక్కేవరు? అన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ- జనసేన పార్టీలకు ఓటమి తప్పదనే భయం నెలకొంది.. ఆ ఓటమి భయంతోనే సామాన్య మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
Read Also: Shopping mall Hero: షాపింగ్ మాల్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
గీతాంజలి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఉంటే కాపాడుకుని ఉండే వాళ్ళమని మంత్రి తానేటి వనిత అభిప్రాయపడ్డారు. టీడీపీ- జనసేన ఫేక్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ- జనసేన సోషల్ మీడియా ఎంతటి దిగజారిపోయిందో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఇక, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్ లపై మహిళలు అధైర్య పడవద్దని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తప్పవని హెచ్చరింంచారు. మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఎటువంటి వేధింపులే వస్తున్నాయని రాజకీయాల్లో ఉండటం వలన పని ఒత్తిడితో పట్టించుకోవడం లేదన్నారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతుంది.. కారుకులైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని మంత్రి తానేటి వనిత అన్నారు.