కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పెద్దకడబూరు మండలం పరిధిలోని కంబదహాళ్ గ్రామంలో ఇవాళ శ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.. ఈ సందర్భంగా వాల్మీకి సోదరులు, గ్రామ ప్రజలు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్ర రాసి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అని తెలిపారు. శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి చరిత్రలో నిలిచాడు అని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో శ్రీ వాల్మీకి మహర్షిలతో పాటు రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, పెద్దకడుబురు మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, రాష్ట్ర బీసీ సాధికార మెంబర్ కురువ మల్లికార్జున, ఆర్టీఎస్ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నకడుబురు దశరథ రాముడు, పెద్దకడుబురు మబ్బు ఆంజనేయులు, కమ్మలదిన్నె శ్రీను, నరసప్ప, మల్దకల్లు, కలిగిరి మల్దకల్లు, కోతి వెంకటేష్, వెంకటేష్ మురళి, శేఖర్, హనుమన్న, రంగన్న, ఐటీడీపీ సభ్యులు కురువ కృష్ణ, దిద్ది నగేష్, వగరురు లింగప్ప తదితరులు పాల్గొన్నారు.