NTV Telugu Site icon

TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?

Tdp

Tdp

విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు. ఈ, ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ స్థాపించి ఇన్నేళ్లు అయినా చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు లేవు.. ప్రజల గురించే పార్టీ ఆలోచన ఉంది తప్ప.. పార్టీ కార్యాలయాల కోసం ఎన్నడూ ఆలోచనే చేయలేదు.. ప్రజల్లో టీడీపీ ఓ భాగం అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన పార్టీ టీడీపీ.. పబ్లిక్ పాలసీలతో ప్రజల జీవితాల్లో పెను మార్పులు తేవచ్చు.. ఐటీని ప్రొత్సహించాం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది.. ప్రజల అవసరాలను.. వారి భవిష్యత్తును ఆలోచించి మేం విధానాలను రూపొందించాం.. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర్నుంచే మేం విరాళాలు సేకరించాం.. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించింది అని చంద్రబాబు అన్నారు.

Read Also: Election Campaign: మెడలో చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న లోక్‌సభ అభ్యర్థి..!

గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించి.. ఆన్ లైన్ గ్యాంబ్లింగుకు అనుమతించాలని సమయం కోసం వైసీపీ ఎదురు చూసింది అని చంద్రబాబు అన్నారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం.. రాష్ట్రం కోసం పని చేయాలి.. టీడీపీ విధానాల వల్ల తాము ఎలా బాగుపడ్డామనే విషయాన్ని ప్రజలకు వివరించాలి.. రూ. 10 మొదలుకుని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చు అని ఆయన తెలిపారు. ప్రజలు, పార్టీ సానుభూతి పరులు ఈ డొనేషన్ల వెబ్ సైట్ ను ప్రమోట్ చేయాలి.. ఎన్ఆర్ఐల నుంచి విరాళాలు సేకరించేందుకు అవసరమైన నిబంధనలను పాటిస్తున్నాం.. చట్ట ప్రకారం నిబంధనలు సరిపోతేనే ఎన్ఆర్ఆల నుంచి విరాళాలు సేకరిస్తాం.. ఏపీలో జగన్ తప్ప ఎవ్వరూ బాగుపడలేదు.. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది.. దేశం సరైన దిశలో వెళ్తోంటే.. ఏపీ రివర్సులో వెళ్తోందని ఆరోపించారు. జనంలో ఇప్పటి వరకు చూడని ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. విద్యారంగంలో నాణ్యత పడిపోయింది.. ప్రపంచం మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృ భాషలోనే ఉంటుంది.. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత.. నాణ్యమైన విద్యకు ఇవ్వడం లేదు అని చంద్రబాబు మండిపడ్డారు.

Read Also: Margani Bharat: డబుల్ ఇంజిన్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఫలితాలు శూన్యం

సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు.. పార్టీని అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు అందరూ కలిసి రావాలన్నారు. ఓటమి ఖాయమని వైసీపీకి అర్థమైంది.. ఓటమిపై క్లారిటీ రావడంతోనే సిట్ కార్యాలయంలో పత్రాలు తగుల పెట్టించారు.. మేమంతా సిద్దం సభలకు కనీసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు.. ఈ డబ్బంతా ఎవరిది? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఏదో మానవతావాదిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. ఐ ప్యాక్ టీం చాలా కష్టపడి జగనులో హ్యూమన్ యాంగిల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ దంతా ప్రీపెయిడ్ హ్యూమన్ టచ్.. 420 లంతా కలిసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు.. ఏపీలో ఒక్క ఫోన్ ట్యాపింగ్ ఏంటీ..? అన్ని తప్పుడు కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో చాలా చిత్ర విచిత్ర వేషాలేస్తారు.. తాడేపల్లి సీఎం నివాసానికి గతంలో డబ్బు వచ్చాయి.. డబ్బులను మిషన్ పెట్టి తూచేవారట.. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ద్వారా చాలా డబ్బు వచ్చేది.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి.. ఆ అవివీతి సంపదలో కొంత బయటకు వదులుతున్నారు.. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లల్లో డబ్బులు వెళ్తూనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.