NTV Telugu Site icon

Chandrababu Protest: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నిరాహార దీక్ష

Chandra Babu

Chandra Babu

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయ‌నున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Read Also: Archana Gautam: కాంగ్రెస్ కార్యాలయం బయట జరిగిన దాడి అత్యాచారం కంటే తక్కువేం కాదు

వివ‌రాల్లోకెళ్తే.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సైతం ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లి నోటీసులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ అవుతూ టీడీపీ శ్రేణుల్లో ఆమె ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. త‌న కుటుంబ స‌భ్యుల అరెస్టును ఖండిస్తూ రేపు నిరాహార దీక్ష చేసేందుకు సిద్దమైంది.

Read Also: Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. నేడే సైకిల్ ట్రాక్ ప్రారంభం

మ‌హాత్మా గాంధీ జయంతి రోజున చంద్రబాబు అరెస్ట్, తన కుటుంబంపై రాజ‌కీయ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని పేర్కొంటూ నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అలాగే, చంద్రబాబు సైతం సైతం జైలులో నిరాహార దీక్ష చేయ‌నున్నారు అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా భువనేశ్వరితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ దీక్షలో పాల్గొంటారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయ‌న‌ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ కుంభకోణం జరిగినట్లు సీఐడీ పేర్కొంది.