Chandrababu: ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి గుర్తొస్తుంది.. సీఎం జగన్ ను చూస్తే విధ్వంసం గుర్తొస్తుందన్నారు. ప్రజా నాయకుడు ఎప్పుడూ అభివృద్ధి చేసేవాడు కావాలి.. కానీ, కూలగొట్టేవాడు నాయకుడు కాదన్నారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే బైరవాని తిప్పా ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే వాళ్లం అని తెలిపారు… ఓట్ల కోసం వైసీపీ దొంగలు మీ ముందుకు వస్తారు… ఎందుకు పని చేయలేదో ప్రజలు నిలదీయాలన్నారు. అనంతపురం జిల్లాకు న్యాయం జరగాలంటే.. వైసీపీ పోవాలి.. ఎన్డీఏ కూటమి రావాలని సూచించారు.
Read Also: Tamilnadu: కోయంబత్తూరులో రీపోలింగ్‌కు అన్నామలై డిమాండ్.. కారణమిదే!
ప్రజలకు ఇచ్చింది ఎంత?.. జగన్ దోచుకుంది.. దొబ్బేసింది ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.. జలగ మాదిరి… జగన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ భరించలేక.. బెంగళూరుకు తరిమేశాడని ఆరోపించారు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది.. పెట్టుబడులు తీసుకురావాలంటే చాలా కష్టం.. పరిశ్రమలు తరిమేయడం చాలా సులభం అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఎవరూ మాట్లాడకుండా.. వాస్తవాలు తెలుసుకొనీకుండా… కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక, ఎన్డీఏ కూటమి వల్ల ముస్లిం, మైనారిటీలకు ఎక్కడా హాని జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులకు ఏనాడు అన్యాయం జరగలేదని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.