NTV Telugu Site icon

TDP – BJP – JSP Alliance Twist: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో కొత్త ట్విస్ట్.. మారిన సీట్ల లెక్కలు..

Alliance Twist

Alliance Twist

TDP – BJP – JSP Alliance Twist: తెలుగుదేశంపార్టీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. అయితే, పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదనలకు మూడు పార్టీ నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు.. అందులో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.. ఇక, 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయ్యింది.. అయితే, తమ కోటాలో నుంచి బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది జనసేన.. అంతేకాకుండా తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ..

Read Also: Vasantha Krishna Prasad: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు..

అంటే పొత్తుల్లో భాగంగా బీజేపీ – జనసేన పార్టీలకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో.. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి బీజేపీ – జనసేన. ముందుగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం కుదరగా.. ఇప్పుడు ఒక అసెంబ్లీ స్థానం పెరిగింది.. అసెంబ్లీ సీట్లల్లో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టింది.. తమ పార్టీ వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర మంత్రి షెకావత్‌ చర్చలు పట్టుబట్టారట.. దీంతో.. తమ కోటాలో నుంచి బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు జనసేన త్యాగం చేయగా.. తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది టీడీపీ. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కోసం మొత్తంగా నాలుగు సీట్లను త్యాగం చేశాయి టీడీపీ – జనసేన. ఇక, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..