NTV Telugu Site icon

Atchannaidu: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ

Atchannaidu

Atchannaidu

Atchannaidu: కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. కాంట్రాక్టర్ల బిల్లుల నిమిత్తం విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని సీఈసీకి తన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు అచ్చెన్న.. ఇక, ఆయన రాసిన లేఖ విషయానికి వస్తే.. తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటేసిందన్న ఆయన.. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు. చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

Read Also: Minister Roja: నేను ఓడిపోతానా..? ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఫస్ట్ రియాక్షన్

ఇక, ఆర్బీఐ ప్రకటన ఆధారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల అప్పులకు ధరఖాస్తు చేసిందని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సీఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు తెస్తున్న రూ.4 వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారు. జూన్ 4, 2024 న ఎన్నికల ఫలితాల రానున్నందన అధికారం కోల్పోతున్న ప్రభుత్వం.. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.