Site icon NTV Telugu

Vinukonda: వినుకొండలో టెన్షన్‌, టెన్షన్‌.. గాలిలోకి కాల్పులు

Vinukonda

Vinukonda

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గీల మధ్య ఘర్షణ జరిగింది.. ఇరువర్గాలు రాళ్లు, కొబ్బరి బోండాలు, చెప్పలు, కర్రలతో దాడి చేసుకున్నారు.. ఘర్షణలో అటు వైసీపీ, ఇటు టీడీపీ వర్గీయులు కూడా గాయపడ్డారు.. అయితే, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అక్రమంగా మట్టి తరలించారంటూ.. జీవీ ఆంజనేయులు ఆందోళన నిర్వహించగా.. దానిని డైవర్ట్‌ చేయడానికి తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.. దీనికి నిరసనగా ఈ రోజు టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.. ర్యాలీ నిర్వహించారు.. అయితే, ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.. దీంతో, ఘర్షణ వాతావరణంలో నెలకొంది.. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడికి దిగడంతో.. పరిస్థితి అదుపుతప్పి పోతోందని గమనించిన పోలీసులు.. ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గక పోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు.. ఇక, ఈ దాడిలో 10 మందికిపైగా గాయాలు పాలు కూడా.. తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలు నిలివేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version