అనంతపురం అర్బన్ మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్‌లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ముందే సాకే వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగాడు. పార్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
Also Read: IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు!
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాకే వెంకటేష్ ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టించుకొని కష్టపడినా.. అర్బన్ నియోజకవర్గంలో తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందాడు. ఈరోజు జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ముందే పురుగుల మందు తాగాడు. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మహానాడు మధ్యలోనే ఆగిపోయింది.
