NTV Telugu Site icon

Threat Call: టీసీఎస్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు

Tcs

Tcs

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది. నిన్న ( మంగళవారం ) బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎంప్లాయిస్, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ పై కోపంతోనే ఓ మాజీ ఉద్యోగి ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Colours swathi : ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ

ఇక, ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీసీఎస్ కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులు పనిలో ఉండగా ఆఫీస్ క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి వేయడంతో పాటు పోలీసులు వెంటనే సమాచారం అందించారు. పరప్పన అగ్రహార పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్యాంపస్‌లో పేలుడు పదార్థాల కోసం గాలించారు.

Read Also: Flowerpots Theft: సెడాన్ కారులో వచ్చి ఛండాలపు పని చేసిన యువతులు

కానీ, టీసీఎస్ క్యాంపస్ లోపల బాంబు, పేలుడు పదార్థాలకు సంబంధించినవి ఏమీ దొరకకపోవడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. అయితే, ఇది ఫేక్ బాంబు కాల్ గా పోలీసులు నిర్ధారించారు. కంపెనీ మాజీ ఉద్యోగి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ ఉద్యోగి వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show comments