Site icon NTV Telugu

TCS Nashik Case: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిదా ఖాన్ హెచ్‌ఆర్ హెడ్ కాదు.. అసలు రహస్యం బయట పెట్టిన సంస్థ..

Tcs

Tcs

TCS Nashik Case: నాసిక్‌లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో జరిగిన లవ్ జిహాద్ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టీసీఎస్ ఆఫీస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్‌ఆర్ హెడ్ నిదా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు మొత్తం బయటపడినప్పటి నుంచి పరారీలో ఉంది. మహారాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ.. ఆచూకీ లభించలేదు. ఈలోగా టీసీఎస్ నిదా ఖాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ టీసీఎస్‌లో హెచ్‌ఆర్ హెడ్ లేదా మేనేజర్ అని వస్తున్న వార్తలకు టీసీఎస్ సమాధానమిచ్చింది. నిదా ఖాన్ కేవలం టెలికాలర్‌గా మాత్రమే పనిచేసిందని స్పష్టం చేసింది.

READ MORE: VC Comments: పొట్టి దుస్తులు వల్లే అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన

ఇదిలా ఉండగా.. ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మానసిక వేధింపులు వంటి తీవ్రమైన అంశాలు ఉన్నట్లు బాధితుల వాంగ్మూలాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిదా ఖాన్ మహిళా ఉద్యోగులకు ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, నమాజ్ చేయాలని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, అందులో కొందరు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు పురుషులు కాగా, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో డానిష్ షేక్, తౌసిఫ్ అటార్, రజా మేమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ ఉన్నారు. వీరందరినీ కంపెనీ సస్పెండ్ చేసింది.

READ MORE: Summer Kitchen Tips: వేసవిలో కిచెన్‌లో ఉండలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఏసీ లేకుండానే మీ వంటగది కూల్‌గా మారిపోతుంది..

Exit mobile version