TCS Nashik Case: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిదా ఖాన్ హెచ్‌ఆర్ హెడ్ కాదు.. అసలు రహస్యం బయట పెట్టిన సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: నాసిక్‌లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో జరిగిన లవ్ జిహాద్ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టీసీఎస్ ఆఫీస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్‌ఆర్ హెడ్ నిదా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు మొత్తం బయటపడినప్పటి నుంచి పరారీలో ఉంది. మహారాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ.. ఆచూకీ లభించలేదు. ఈలోగా టీసీఎస్ నిదా ఖాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ టీసీఎస్‌లో హెచ్‌ఆర్ హెడ్ లేదా మేనేజర్ అని వస్తున్న వార్తలకు టీసీఎస్ సమాధానమిచ్చింది. నిదా ఖాన్ కేవలం టెలికాలర్‌గా మాత్రమే పనిచేసిందని స్పష్టం చేసింది.
READ MORE: VC Comments: పొట్టి దుస్తులు వల్లే అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన
Also Read
ఇదిలా ఉండగా.. ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మానసిక వేధింపులు వంటి తీవ్రమైన అంశాలు ఉన్నట్లు బాధితుల వాంగ్మూలాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిదా ఖాన్ మహిళా ఉద్యోగులకు ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, నమాజ్ చేయాలని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఒత్తిడి చేసేదని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, అందులో కొందరు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు పురుషులు కాగా, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో డానిష్ షేక్, తౌసిఫ్ అటార్, రజా మేమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ ఉన్నారు. వీరందరినీ కంపెనీ సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!