Site icon NTV Telugu

TCS ఉద్యుగులకు షాక్.. వారందరికీ అప్రైజల్స్ స్టాప్ అంటూ..!

Tcs Layoffs

Tcs Layoffs

TCS: ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ ‘హైబ్రిడ్’ మోడల్‌ను అనుసరిస్తుంటే టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని కచ్చితమైన నిబంధన పెట్టింది. అంతేకాకుండా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోని కొన్ని త్రైమాసికాల్లో (జూలై-సెప్టెంబర్ 2025) అటెండెన్స్ నిబంధనలను పాటించని ఉద్యోగుల అప్రైజల్స్ నిలిచిపోయాయి. ఆపరేషనల్ లెవల్‌లో ప్రక్రియ పూర్తయినా.. కార్పొరేట్ విభాగం వీటికి క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం.

Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్‌మన్ గిల్

ఈ చర్యతో ప్రధానంగా కొత్తగా చేరిన వారిపై పడుతోంది. ఎందుకంటే 2022లోనే టీసీఎస్ లాటరల్ హైర్స్ (అనుభవం ఉన్న వారు) కోసం వార్షిక అప్రైజల్ విధానాన్ని రద్దు చేసింది. ఆ తర్వాతి త్రైమాసికాల్లో కూడా నిబంధనలు పాటించకపోతే, ఆ ఉద్యోగులను FY26 బ్యాండింగ్ సైకిల్ నుండి పూర్తిగా మినహాయిస్తామని కంపెనీ హెచ్చరించింది. అంటే ఆ ఏడాదికి వారికి ఎలాంటి పర్ఫార్మెన్స్ బ్యాండ్ కేటాయించబడదు. దీనితో అది వారి జీతాల పెంపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!

ఆఫీసుకు రావడంపై ఉన్న నిబంధనలకు కొన్ని మినహాయింపులను కూడా టీసీఎస్ గతంలో ప్రకటించింది. త్రైమాసికానికి గరిష్టంగా 6 రోజుల వరకు మినహాయింపు పొందవచ్చు. కానీ మిగిలిపోయిన రోజులను తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోలేరు. ఆఫీసులో స్థలం లేకపోవడం వంటి సమస్యలు ఉంటే 30 ఎంట్రీల వరకు, నెట్‌వర్క్ సమస్యలు ఉంటే 5 ఎంట్రీల వరకు మినహాయింపు కోరవచ్చు. ఇంకా అటెండెన్స్ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా బల్క్ అప్‌లోడ్స్ లేదా బ్యాకెండ్ అడ్జస్ట్‌మెంట్లను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.

Exit mobile version