NTV Telugu Site icon

BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?

Bbc Offices

Bbc Offices

IT Searches At BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబయిల్లోని బీబీసీ ఇండియా మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్లిన ఐటీ అధికారులు అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి బీబీసీ ఉద్యోగులను ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని కంప్యూటర్లు, ఫోన్లను స్కాన్‌ చేసినట్లు తెలుస్తోంది. లండన్‌ ప్రధాన కార్యాలయంతో పాటు భారత్‌లోని ఆఫీస్ బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్​ వివరాలపై దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్ల నివాసాలపై ఐటీ సోదాలు జరగడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీబీసీ మాత్రం పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ, 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన వారాల తర్వాత యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేయడంతో ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో రాత్రంతా సోదాలు కొనసాగాయి. బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్), ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో, దాని ప్రసార విభాగం తప్ప మిగతా వారందరూ ఇంటి నుండి పని చేయమని కోరింది. “ఉద్యోగులు వ్యక్తిగత ఆదాయంపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండగలరు. వారు ఇతర జీతం సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి” అని బ్రాడ్‌కాస్టర్ చెప్పారు. అధికారులతో సహకరించాలని, ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వండి అని బ్రాడ్‌కాస్టర్ తన సిబ్బందికి సూచించారు.

Infosys: ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు.. విశాఖలో కార్యాకలాపాలు ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం..

2002లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై విమర్శించే రెండు భాగాల సిరీస్ కోసం ప్రభుత్వం బీబీసీని టార్గెట్ చేసిందని పలు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించే పత్రికా సంస్థలను భయపెట్టడానికి లేదా వేధించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకునే విస్తృత ధోరణిలో ఈ దాడులు భాగమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ గత నెలలో పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తీసివేయబడింది. యూట్యూబ్ వీడియోలు, డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్‌లను పంచుకునే ట్విట్టర్ పోస్ట్‌లను నిరోధించడానికి కేంద్రం ఐటీ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించింది. ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని “శత్రువు ప్రచారం, భారత వ్యతిరేక చెత్త” అని నిందించింది.

అమెరికా ఏమందంటే..
ఢిల్లీలోని బీబీసి కార్యాలయంలో భారతీయ పన్ను అధికారులు నిర్వహించిన సర్వే ఆపరేషన్ గురించి తమకు తెలుసునని అయితే దాని తీర్పును అందించే స్థితిలో లేమని యునైటెడ్ స్టేట్స్ మంగళవారం తెలిపింది. పన్ను ఎగవేత విచారణలో భాగంగానే ఈ ఆపరేషన్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. నిపై మరిన్ని వివరాలు భారత అధికారులే ఇవ్వగలరని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేందుకు నిరాకరించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల వల్లే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందన్న విషయాన్ని గుర్తు చేసింది.

Show comments