Tata Tiago Cng Car : రూ. 52 వేలకే టాటా టియాగో CNG కారు కొనే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అందుకే ప్రజలు సీఎన్జీ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కూడా సీఎన్జీ వేరియంట్ కారులను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ప్రస్తుతం టాటా టియాగో సీఎన్జీ కారు.. ఇది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లోని ప్రముఖ కార్లలో ఒకటి అని చెప్పవచ్చు.. టియాగో దాని డిజైన్, ఫీచర్లు, మైలేజ్, సరసమైన ధరల కారణంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. టాటా టియాగో సీఎన్జీ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ హ్యాచ్ బ్యాక్ ను కొనుగోలు చేయడానికి సులభమైన ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టాటా టియాగో సీఎన్జీ బేస్ మోడల్ ధర రూ. 6,43,900 ( ఎక్స్ షోరూమ్ ) ఆన్ రోడ్ రూ. 7,27,161 వరకు ఉంటుంది.
Also Read : New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం … షెడ్యూల్ ఇదే
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
టాటా టియాగో సీఎన్జీని కొనుగోలు చేయడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేం అనుకుంటే.. పైనాన్స్ ప్లాన్ ద్వారా ఈ కారును కేవలం రూ. 52 వేలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ ఫైనాన్స్ ప్లాన్ ను వివరించే డౌన్ పేమెంట్.. ఈఎంఐ కాలిక్యులేటర్ ప్రకారం.. మీ వద్ద రూ. 52000 బడ్జెట్ ఉంటే.. మీరు కారు కోసం నెలవారీ ఈఎంఐ చెల్లించగలిగితే.. దీని ఆధారంగా బ్యాంక్ 9.8 శాతం వార్షిక వడ్డీ రేటుతో మీకు ఆన్ రోడ్ ధరపై 90శాతం వరకు లోన్ ఇస్తుంది. టాటా టియాగో సీఎన్జీపై లోన్ జారీ చేసిన తర్వాత.. ఈ కారు డౌన్ పేమెంట్ కోసం 60 వేల రూపాయలు డిపాజిట్ చేయాలి.. ఆ తర్వాత నెలవారీ రూ. 14,279 ఈఎంఐ.. 5 సంవత్సరాల వ్యవధిలో చెల్లించాలి.
Also Read : Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..
టాటా టియాగో సీఎన్జీ 1199సీసీ ఇంజన్ తో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పని చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72బీహెచ్పీ పవర్, 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీకి సంబంధించి.. ఈ హ్యాచ్ బ్యాక్ ఒక కిలో మీటర్ మైలేజీని ఇస్తుందని టాటా మోటర్స్ పేర్కొంది. ఈ మైలేజీని ARAI ధృవీకరించింది. టాటా టియాగో సీఎన్జీలో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్.. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్.. ముందు సీటుపై డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ లు వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
- Tags
- auto
- automobile
- car
- Cars
- RS 52 thousand
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..