Tata Sierra Prices: టాటా మోటార్స్ (Tata Motors) తన కొత్త కార్ సియెర్రా( Sierra )ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చిన ఈ కారు, అందరి దృష్టిని ఆకర్షించింది. సియెర్రా, టాటా మోటార్స్‌కు మరో నెక్సాన్ అవుతుందని, ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. కారు ధరలను కూడా టాటా అగ్రిసివ్‌గా సెట్ చేసింది. సియెర్రా బేసిక్ వెర్షన్ ధర రూ. 11.49 లక్షలు( ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
సియెర్రాలో Smart Plus, Pure, Pure Plus, Adventure, Adventure Plus, Accomplished, Accomplished Plus వేరియంట్ల ఉన్నాయి. వీటిలో టాప్- టూ వేరియంట్ల ధరలు మినహా మిగతా వాటి ధరల్ని ప్రకటించారు. ఈ SUV బుకింగ్‌లు డిసెంబర్ 16, 2025న ప్రారంభమవుతాయి, డెలివరీలు జనవరి 15, 2026 నుండి ప్రారంభమవుతాయి.

ఇంజన్ ఆప్షన్లు:
సియెర్రా పెట్రోల్ వేరియంట్లో 1.5 లీటర్ 4-సిలిండర్ TGDi టర్బో ఇంజిన్ 160hp పవర్, 255Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. .5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ (Atkinson cycle) ఇంజన్ 106hp పవర్ 145Nm టార్క్ కలిగి ఉంటుంది. డిజిల్ వేరియంట్లో 118hp 1.5-లీటర్ Kryojet డీజిల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. డిజిల్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్లను కలిగి ఉంటుంది.
ఫీచర్లు, సేఫ్టీ:
టాటా మొదటిసారిగా 3-డ్యాష్ బోర్డ్ స్క్రీన్లను ఇస్తోంది. 12-స్పీకర్ జేబీఎల్ సిస్టమ్, సోనిక్ షాఫ్ట్ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. అతిపెద్ద పానరోమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది. డ్యుయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, విండోలకు సన్ షేడ్స్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
Level 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ESP (21 ఫంక్షన్లు), 6 ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఫ్రంట్ & రియర్ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది.