Site icon NTV Telugu

రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra టాప్ వేరియంట్ల ధరలు వెల్లడి..!

Tata Sierra

Tata Sierra

Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నవంబర్ 2025లో ప్రతిష్టాత్మక టాటా సియెరా SUVను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పట్లో కేవలం ప్రారంభ ధరను మాత్రమే ప్రకటించిన కంపెనీ, దశలవారీగా వేరియంట్ల ధరలను వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా సియెరా టాప్ ఎండ్ అకంప్లిషెడ్ (Accomplished), అకంప్లిషెడ్ ప్లస్ (Accomplished Plus) వేరియంట్ల ధరలను అధికారికంగా ప్రకటిస్తూ పూర్తి ధరల జాబితాను విడుదల చేసింది.

Top 5 Best-Selling Cars: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే!

టాటా సియెరా అకంప్లిషెడ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా.. ఇది 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇక టాప్ ఎండ్ అకంప్లిషెడ్ ప్లస్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ ఇంజిన్‌తో వస్తుంది. టాటా సియెరా 1.5 లీటర్ NA పెట్రోల్ (106 హెచ్‌పీ), 1.5 లీటర్ డీజిల్ (116 హెచ్‌పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 హెచ్‌పీ) అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది.

టాటా సియెరా అకంప్లిషెడ్ (Accomplished), అకంప్లిషెడ్ ప్లస్ ధరలు (ఎక్స్-షోరూమ్):
* 1.5 NA పెట్రోల్ MT: 17.99 లక్షలు (Accomplished మాత్రమే)

* 1.5 టర్బో పెట్రోల్ AT: 19.99 (Accomplished), 20.99 లక్షలు (Accomplished Plus)

* 1.5 డీజిల్ MT: 18.99 (Accomplished), 20.29 లక్షలు (Accomplished Plus)

* 1.5 డీజిల్ AT: 19.99 (Accomplished), 21.29 లక్షలు (Accomplished Plus)

OnePlus 15R లాంచ్‌కు ముందే ధర లీక్..! అదిరిపోయే ఫ్యూచర్స్‌..

ట్రాన్స్‌మిషన్ పరంగా.. NA పెట్రోల్‌కు 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT ఆప్షన్లు ఉన్నాయి. డీజిల్ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అందుబాటులో ఉన్నాయి. టర్బో పెట్రోల్ వేరియంట్ మాత్రం కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే వస్తుంది. అకంప్లిషెడ్ ట్రిమ్‌లో NA పెట్రోల్ DCT మినహా మిగతా అన్ని ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. ఇక అకంప్లిషెడ్ ప్లస్ ట్రిమ్‌లో పెట్రోల్ ఇంజిన్ పూర్తిగా తొలగించి.. టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను మాత్రమే అందిస్తున్నారు.

Exit mobile version