Tata Punch New Edition 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన పంచ్ మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక, పరిమిత కాల కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. సీవీడ్ గ్రీన్ కలర్‌లో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.8,44,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకమైన కామో థీమ్‌తో తీసుకువచ్చిన ఈ పంచ్‌లో పలు ప్రీమియం ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పంచ్ రెగ్యులర్ వేరియంట్‌ల ధరలు రూ.6.13 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది.
సీవీడ్ గ్రీన్ కలర్‌లో వైట్ రూఫ్, ఆర్16 చార్‌కోల్ గ్రే అల్లాయ్ వీల్స్, ప్రత్యేకమైన కామో థీమ్డ్ నమూనాను కలిగి ఉన్న ప్రీమియం కారు ఇది. ఈ ఎడిషన్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్‌తో కూడిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, వెనుక ఏసీ వెంట్‌లు, సి-టైప్ యూఎస్‌బీ ఛార్జర్, కంఫర్ట్ టెక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్ పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.
Also Read: IPL 2025-RCB: ఆర్‌సీబీలో అతడు కొనసాగడం కోహ్లీకి ఇష్టమే: ఏబీ
2021లో టాటా పంచ్ విడుదల అయింది. అప్పటినుంచి ఈ కారుకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2022లో పంచ్ కామో ఎడిషన్ లాంచ్ అయింది. 2023లో నిలిపివేయగా.. ఈసారి పండుగ సీజన్ ఆఫర్‌గా పరిమిత యూనిట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కామో ఎడిషన్ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంటుందని భావిస్తున్నట్లు సీసీఓ వివేక్ శ్రీవాత్సవ తెలిపారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ సి3, మారుతీ ఫ్రాంక్స్, టయోటా టైసర్ వంటి వాటికి గట్టి ప్రత్యర్థిగా ఉంది.