NTV Telugu Site icon

Tata Nexon iCNG: ‘నెక్సాన్‌ ఐసీఎన్‌జీ’ లాంచ్‌.. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల ప్రయాణం!

Tata Nexon Icng

Tata Nexon Icng

Tata Nexon iCNG Launch and Price in India: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తన నెక్సాన్‌ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. సీఎన్‌జీ వేరియంట్‌లో ‘నెక్సాన్‌ ఐసీఎన్‌జీ’ని తీసుకొచ్చింది. ఇప్పటికే నెక్సాన్‌ లైనప్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఈవీ వేరియంట్స్ ఉండగా.. తాజాగా సీఎన్‌జీ వేరియంట్‌ కూడా వచ్చింది. నెక్సాన్‌ ఐసీఎన్‌జీ ప్రారంభం ధర రూ.8.99 (ఎక్స్‌ షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

నెక్సాన్‌ ఐసీఎన్‌జీ 8 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో స్మార్ట్ (ఓ), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ ఉన్నాయి. భారతదేశంలో టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ వాహనంగా ఈ కారు నిలిచింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో నెక్సాన్‌ ఐసీఎన్‌జీ వచ్చింది. 98 bhp, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్‌ సిలిండర్‌ సదుపాయంతో ఈ ఐసీఎన్‌జీని లాంచ్‌ అయింది. రెండు స్లిమ్‌ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుంది.

Also Read: Director Arrest: ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!

నెక్సాన్‌ ఐసీఎన్‌జీలో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ ఉంటుంది. 10.25 ఇంచెస్ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెథర్‌ సీట్లు, నావిగేషన్‌ డిస్‌ప్లే ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉంటాయి. అన్ని వేరియంట్లు కూడా 6 ఎయిర్‌బ్యాగులతో వస్తున్నాయి. ఫ్రంట్ పవర్ విండో, హిల్ హాల్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. సీఎన్‌జీ మోడ్‌లో ఇంధన సామర్థ్యం కిలోగ్రాముకు 24 కిలోమీటర్లు అని కంపెని పేర్కొంది.

Show comments